Wednesday, February 15, 2006

Nireekshana..

నిరీక్షణ

మార్పులేని నా తూర్పు వాకిలి లో

 హ్రుదయం లేనిది ప్రతి ఉదయం.
నీ రాకతో నన్ను చేరె తొలికిరణం,
నీ నవ్వుతో వాలెను జాబిలిసైతం.
 

చెలిమిగా నాతో చేయికలిపావు
చిలిపిగా నాతో తగువులాడావు.
నీతో గడిచిన ఆ ప్రతిక్షణం
జీవితమంతా ఇక స్మ్రితిపదం.

నువ్వంటే ఇష్టం ఉన్నా,
మౌనంగా మది అది స్నేహం అంది.
గుండె చప్పుడులో నీ పేరు విన్నా!
ఈ కొత్త అలజడిలో ఎదో దాగుంది.

అర్దం కాని అద్బుతం అది
కోకిలకందని రాగం అది..
కవితలు పలకని భావం అది
కలయో నిజమో తెలియకున్నది.

అణువంతే నా యెదలో ఉన్నా,
తనువంతా తానే అంది.
కరగని స్వప్నంలా చేరుకున్నా,
తరగని సిరిలా నాతో ఉంది.

నడయాడే దీపం తన రూపం
ప్రక్రితిలో లేనిది ఆ అందం.
నన్నే నేను మరిచిన తరుణం
నా మనసుకి నాతో కొత్త పరిచయం.

చిటపట చినుకుల ధ్వనిలోన,
నీ చిరునవ్వే నే విన్నా.
గలగల మెరిసిన మెరుపులోన
నీ పిలుపే నను చేరేనా!!

చెంతచేరి అంత దూరమైనావు
దూరమై మరింత చేరువైనావు.
క్షణం క్షణం అనుక్షణం
నీ కోసమే ఈ నీరీక్షణం.


--కొన
14 Feb '06